డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫుల్ మాస్ రేంజ్లో ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అలాగే తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. మొదటి తెలుగు సినిమాలోనే ఢీగ్లామర్ రోల్ పోషిస్తుంది జాన్వీ. ఇందులో ఆమె తంగం (బంగారం) అనే పాత్రలో కనిపించనుందంటూ ఇటీవలే మేకర్స్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా దేవర. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫుల్ మాస్ రేంజ్లో ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అలాగే తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. మొదటి తెలుగు సినిమాలోనే ఢీగ్లామర్ రోల్ పోషిస్తుంది జాన్వీ. ఇందులో ఆమె తంగం (బంగారం) అనే పాత్రలో కనిపించనుందంటూ ఇటీవలే మేకర్స్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు.
అయితే దేవర సినిమా విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు డైరెక్టర్ కొరటాల. ఈ సినిమా నుంచి ఒక్క క్లిప్ కట్ చేయకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నామని.. అందుకే రెండు భాగాలుగా దేవరను రూపొందిస్తున్నామని గతంలోనే వెల్లడించారు. ఇక ఇటీవలే ఈ సినిమా గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా దేవర సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు ఇంకా 150 రోజులే ఉందని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. “భయానికి మరో పేరే దేవర. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి. Devara Frenzy కౌంట్ డౌన్ షూరు” అంటూ అదిరిపోయే పోస్టర్ రివీల్ చేశారు. ఇందులో రెండు చేతులతో ఆయుధాలు పట్టుకుని.. నీళ్ల మధ్యలో రాయి మీద నిలబడి భీకరంగా కనిపిస్తున్నారు తారక్.