ఘోరం.. ఇంట్లో పేలిన సిలిండర్.. కుటుంబంలో ఏడుగురు మృతి

ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gay Cylinder Blast) పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఏడుగురు సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లా పథార్‌ ప్రతిమా గ్రామంలో ఓ ఇంటిని కొంతమంది వ్యక్తులు బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. సోమవారం రాత్రి భారీ శబ్దంతో ఆ ఇంట్లో పేలుడు సంభవించింది. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.

నలుగురి ఆచూకీ గల్లంతు

అయితే ప్రమాద సమయంలో ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఉండగా.. అందులో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన నలుగురి ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టారు. ఇక ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్‌ పేలుడు కారణంగానే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *