డేవిడ్ వార్నర్(David Warner).. ఈ పేరు తెలియని భారత అభిమానులుండరు. తన ఫించ్ హిట్టింగ్‌తోనూ, IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్‌గానూ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. పేరుకు ఆస్ట్రేలియన్ అయినా తెలుగు ప్రజల ఆదరణ పొందడంలో ఏమాత్రం తగ్గలేదు. పైగా బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాటకు వేసిన స్టెప్పుల నుంచి పుష్ప(Pushpa) సినిమాలోని తగ్గేదే లే అనే డైలాగ్, అదే సినిమాలోని “చూపే బంగారమాయేనే శ్రీవల్లి” అనే పాట వరకూ బన్నీ వేసిన స్టెప్పులతో రీల్స్ చేసి సోషల్ మీడియా(SM)లోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్(International Cricket)కు గుడ్ బై చెప్పిన వార్నర్ ఇప్పుడు సినీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.
సంబంధం లేని ఫీల్డ్ అయినా..
తనకు సంబంధం లేని ఫీల్డ్ అయినా.. వార్నర్ తన డ్యాన్సు(Dance)లతో, ఆహార్యంతో చాలా అలరించాడు. ఇండియాలో ఏ ఇతర క్రికెటర్ కి లేనంతగా, భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అదే గొప్ప క్వాలిటీ అతడిని నటుడిని చేస్తోంది. అంతేకాదు.. అతడు గ్లోబల్ ప్రపంచంలో హవా సాగిస్తున్న టాలీవుడ్(Tollywood)లో స్టార్ అవుతున్నాడు. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న `రాబిన్‌హుడ్(Robinhood)` చిత్రంలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించనున్నాడు. ఆ మేరకు నిర్మాత రవిశంకర్ ఇటీవల ప్రీరిలీజ్ వేడుకలో అధికారికంగా కన్ఫామ్ చేశాడు.

మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబిన్‌హుడ్
ఈ చిత్రంలో నితిన్- శ్రీలీల(Nitin-Srileela) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాబిన్ హుడ్ కథ మలుపులు ట్విస్టులతో కూడిన యాక్షన్-కామెడీ చిత్రం. మార్చి 28న విడుదల కానుంది. ఇలాంటి క్రేజీ చిత్రంతో అతడు తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నాడు కాబట్టి, దేశవ్యాప్తంగా తనపై అటెన్షన్ పెరుగుతుంది. అయితే ఈ మూవీలో వార్నర్ పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది.






