నాన్న.. ప్రతిఒక్కరి జీవితంలో ఓ ఎమోషన్(Emotion).. ఆయనే ఓ హీరో. నాన్న(Father) అంటే త్యాగం.. నాన్న అంటే ప్రేమ(Love)తోకూడిన ఓ బాధ్యత. తన రెక్కలను ముక్కలు చేసుకొని రేయింబగళ్లు కష్టపడి పిల్లలకు కవచంగా నిలుస్తాడు. తాను ఓడిపోయినా.. పిల్లల్ని గెలిపించే త్యాగశీలి నాన్న. తన కలల్ని మర్చిపోయి.. తన పిల్లల కలల్ని నిజం చేసే గొప్ప మనసున్న వ్యక్తి నాన్న. మన భవిష్యత్తును నిలబెట్టే గొప్ప గురువు నాన్న.. మనం ఎప్పుడూ చదవాలనిపించే ఓ గొప్ప పుస్తకమే నాన్న. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచానికి మనల్ని చూపేది అమ్మ(Mother) అయితే.. ప్రపంచాన్నే మనకు చూపేది నాన్న. ప్రతిక్షణం తమ బిడ్డల ఎదుగుదలను కాంక్షించే ప్రతినాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే(Happy Father’s Day).. మిమ్మల్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపడుతున్న నాన్నకి ఈ రోజైనా ‘లవ్ యూ నాన్న’ అని చెప్పేయండి..
పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా..
అలాంటి తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 15వ తేదీన ఫాదర్స్ డే(Father’s Day) జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేడు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులంతా సోషల్ మీడియా(SM) వేదికగా ఫాదర్స్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ పోలీసులు(Telangana Police) విషెస్ చెబుతూ ఆసక్తికర ట్వీట్(Tweet) పెట్టారు. ‘ప్రతి వ్యక్తికి తొలి హీరో నాన్న. కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల భవిష్యత్తు(Children’s Future) కోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తి నాన్న. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా జీవించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అని పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తికి తొలిహీరో నాన్న. కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తి నాన్న. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా జీవించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.#telanganapolice #HappyFathersDay pic.twitter.com/izs4OjCt0Z
— Telangana Police (@TelanganaCOPs) June 15, 2025






