Pranay Case: నిందితులు వీరే.. ఎవరెవరికి ఎంత శిక్షో తెలుసా?

తెలంగాణ(Telangana)లో 2018లో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసు(Pranay Murder Case)లో ఇవాళ సంచలన తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. దాదా 6 తర్వాత ఈ మర్డర్ కేసులో తీర్పు వచ్చింది. అమృత-ప్రణయ్ కేసులో A1 అయిన అమృత తండ్రి మారుతీరావు(Maruthi Rao) 2020లో ఆత్మహత్య(Suicide) చేసుకోగా.. మిగతా వారికీ శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది. మరి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు. కోర్టు నిందితులకు(to the accused) ఎవరికి ఏఏ శిక్ష విధించిందో తెలుసుకుందాం..

Pranay murder case | ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన  తీర్పు-Namasthe Telangana

నిందితులు ఎవరంటే..

☛ A1 మారుతీరావు (అమృత తండ్రి),
☛ A2 సుభాష్ శర్మ(బిహార్), ఉరిశిక్ష + 15,000 ఫైన్
☛ A3 అస్ఘర్‌ అలీ, జీవిత ఖైదు+ 10,000 ఫైన్
☛ A4 అబ్దుల్ భారీ, జీవిత ఖైదు + 15,000 ఫైన్
☛ A5 అబ్దుల్ కరీం, జీవిత ఖైదు + 15,000 ఫైన్
☛ A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు) జీవిత ఖైదు + రూ.15,000 ఫైన్
☛ A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్) జీవిత ఖైదు +10,000 ఫైన్
☛ A8 నిజాం (ఆటో డ్రైవర్) జీవితఖైదు + 10,000 ఫైన్

Pranay Case: ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ | Suspense over the  final verdict in Pranay case VK

శిక్ష తగ్గించాలని నిందితుల వినతి

కాగా.. కరీం సహాయంతో అస్ఘర్‌కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్‌ను హత్య చేయించాడు. కాగా ఈ కేసులో పోలీసులు దాదాపు 1600 పేజీలు ఛార్జ్ షీటు దాఖలు చేయగా.. సుదీర్ఘంగా విచారించిన కోర్టు BNS 302, 120 IPC, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. అయితే శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్థులు వేడుకున్నా.. కోర్టు వారి వినతిని పట్టించుకోకుండా తుది తీర్పు వెలువరించింది. అయితే వీరంతా పైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Related Posts

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *