
మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతోంది. ఈ క్రమంలో ఈసారి పక్కా హిట్ కొట్టాలని సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ధమాకా తర్వాత ఆ రేంజు హిట్ కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి ఫ్లాప్ చిత్రాల తర్వాత ఆయన తాజాగా ‘మాస్ జాతర (Mass Jathara)’ అనే మూవీతో రానున్నారు.
This one’s going to be a massiest feast for everyone who’s been waiting 🙂 🫶🏻#TuMeraLover on April 14th. 💃#MassJathara@RaviTeja_offl @BheemsCeciroleo @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya @vidhu_ayyanna @NavinNooli @nandusavirigana @phanikvarma @SitharaEnts… pic.twitter.com/LrUHLVAQrR
— Sreeleela (@sreeleela14) April 10, 2025
తూ మేరా లవర్ సాంగ్
‘మాస్ జాతర : మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్. రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. ధమాకాలో రవితేజతో జతకట్టిన శ్రీలీల (Sreeleela) ఈ మూవీలోనూ నటిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ వదిలారు. మాస్ జాతర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు అప్డేట్ ప్రకటించారు. ‘తూ మేరా లవర్ (Tu Mera Lover)’ అంటూ సాగే ఈ సాంగ్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇడియట్ సాంగ్ రీమిక్స్
అయితే ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ ఫిల్మ్స్ లో ఒకటైన ఇడియట్(Ravi Teja Idiot)లోని చూపులతో గుచ్చి గుచ్చి పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9వ తేదీన థియేటర్‌లలో ఈ ఫిల్మ్ సందడి చేయనుంది. టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.