Puri Sethupathi : ఇట్స్ అఫీషియల్.. ‘పూరి-సేతుప‌తి’ ప్రాజెక్ట్‌లో టబు

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి.. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు మూటగట్టుకుంటున్నాడు. ఇక తాజాగా ఆయన కోలీవుడ్ హీరోతో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో కలిసి ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

పూరి-సేతుపతి సినిమాలో టబు

తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో బాలీవుడ్ నటి టబు (Actress Tabu) కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టు పెట్టింది. ఈ మూవీలో టబు నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ‘పూరి కనెక్ట్స్ (Puri Connects)’ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుందని వెల్లడించింది. ఈ మూవీకి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఫ్లాపులతో పూరి

గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పూరి.. విజయ్ దేవరకొండతో లైగర్ (Liger) చేశాడు. సూపర్ హిట్ కొట్టి ఇక ఫామ్ లోకి వస్తాడనుకున్న ఈ డైరెక్టర్ డిజాస్టర్ మూటగట్టుకుని మరింత లోతుకు కూరుకుపోయాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) మూవీతో అదృష్టం పరీక్షించుకుందామనుకుంటే అది కూడా ఫ్లాప్ అయ్యి షాక్ ఇచ్చింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *