Vishwambhara : ‘విశ్వంభర’ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఫీ మేల్ లీడ్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగు దాదాపుగా పూర్తవ్వగా.. ప్రస్తుతం చిత్రబృందం వీఎఫ్ఎక్స్ పై ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు.

రామరామ ఫస్ట్ సింగిల్ 

‘రామ రామ (Rama Raama)’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది.  ఇందులో చిరు ఆంజనేయస్వామి వేషధారణలో ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించారు.  లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు.  చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ నిర్మిస్తున్నారు.

మెగా-అనిల్ మూవీ

మరోవైపు చిరు విశ్వంభర తర్వాత మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ మూవీలో వింటేజ్ చిరును చూస్తారంటూ ఇప్పటికే అనిల్ హింట్ ఇచ్చారు. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర పేరు శంకరప్రసాద్ అని కూడా చెప్పారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్.. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ యాక్షన్ ఫిల్మ్ చేయనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *