మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఫీ మేల్ లీడ్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగు దాదాపుగా పూర్తవ్వగా.. ప్రస్తుతం చిత్రబృందం వీఎఫ్ఎక్స్ పై ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు.
A Hanuman’s love and reverence for his Lord Shri Ram 🏹✨#Vishwambhara First Single #RamaRaama out on April 12th ❤️🔥
Music by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by ‘Saraswatiputra’ @ramjowrites ✒️MEGA MASS BEYOND UNIVERSE.
MEGASTAR @KChiruTweets @trishtrashers… pic.twitter.com/obH0onoxhN
— UV Creations (@UV_Creations) April 10, 2025
రామరామ ఫస్ట్ సింగిల్
‘రామ రామ (Rama Raama)’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో చిరు ఆంజనేయస్వామి వేషధారణలో ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్నారు.
మెగా-అనిల్ మూవీ
మరోవైపు చిరు విశ్వంభర తర్వాత మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే చిరంజీవి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఈ మూవీలో వింటేజ్ చిరును చూస్తారంటూ ఇప్పటికే అనిల్ హింట్ ఇచ్చారు. అంతే కాదు ఇందులో ఆయన పాత్ర పేరు శంకరప్రసాద్ అని కూడా చెప్పారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్.. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ యాక్షన్ ఫిల్మ్ చేయనున్నారు.






