Biryani: రూ. 2 లకే నాయుడి గారి కుండ బిర్యానీ..

కేవలం 2 రూపాయలకే హైదరాబాద్‌ బిర్యానీ అందిస్తామంటుంది నాయుడి గారి కుండ బిర్యానీ. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది..బిర్యానీని తినాలంటే కేవలం 2 రూపాయల నోట్‌ ఇస్తేనే బిర్యానీ తినే అవకాశం అని పేర్కొంది.
బిర్యానీ (Biryani) పేరు చెప్పగానే ఎవరికైనా నోరూరిపోతుంది. అలాంటి బిర్యానీ తినాలంటే వందల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. కానీ పసందైన బిర్యానీ కేవలం రూ. 2 కే (2 rupees) ఆస్వాదించవచ్చు అంట. ఈ ఆఫర్‌ ఇస్తుంది మరెవరో కాదు…హైదరాబాద్‌ లో ఫేమస్‌ నాయుడిగారి కుండ బిర్యానీ (Naidu gari kunda biryani) యాజమాన్యం.

రూ.2 లకే బిర్యానీ ఎలా తినేద్దాం అనుకున్నారు మరి. ఇంతకీ ఆ మెలిక ఏంటో తెలుసా..రూ. 2 నోట్‌ ని తీసుకుని వచ్చిన వారికి మాత్రమే ఈ అవకాశం అంటూ రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. 2 రూపాయాల నోట్‌ ఇవ్వండి మీకు నచ్చిన వెజ్‌ కానీ, నాన్‌ వెజ్‌ బిర్యానీ కానీ తిని వెళ్లండి అంటూ ఊరిస్తుంది.
నగరంలో నెల రోజుల కిందట ఈ రెస్టారెంట్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రూ. 2 నోట్లు 120 వచ్చాయని వివరించారు. ప్రజల వద్ద రూ. 2 నోట్లు ఉన్నాయా? లేదా తెలుసుకునేందుకు ఈ ఆఫర్‌ని ప్రారంభించామని దీనికి విశేషమైన స్పందన వస్తుందని యాజమాని మనోహర్‌ అన్నారు.
నాయుడిగారి కుండ బిర్యానీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం ఇదేమి మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా 30 కంటే ఎక్కువ వెరైటీలు ఉన్న బాహుబలి థాలీ తినాలని భోజన ప్రియులకు సవాల్‌ విసిరింది. అరగంటలోనే ఈ థాలీని తింటే కనుక లక్ష రూపాయలు అందిస్తామని తెలిపింది. ఈ ఛాలెంజ్‌ ఇప్పటి వరకు ఏడుగురు విజయం సాధించారు.
హైదరాబాద్‌ అంటేనే బిర్యానీకి చాలా ఫేమస్‌. బిర్యానీ లవర్స్‌ ని దృష్టిలో పెట్టుకుని పలు రెస్టారెంట్లు సైతం ఆఫర్లను సైతం ఇస్తున్నాయి.

Related Posts

Recharge Rates: మొబైల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మొబైల్ యూజర్ల(Mobile Users)కు కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. త్వరలోనే మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు రీఛార్జీల ధరలు(Recharge rates hike) పెంచనున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లోనూ స్మార్ట్ ఫోన్ల వినియోగమూ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు 1GB…

Reliance Jio: యాడ్ ఫ్రీ యూట్యూబ్‌ కోసం జియో కొత్త ఆఫర్

ప్రస్తుతం ప్రపంప వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్(Smart Phones) వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఇండియా(India)లోనూ వీరి సంఖ్య భారీగానే ఉంది. యూజర్లు(Users( తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్నాపెద్దా, చదువున్న, లేకున్నా ప్రతిఒక్కరికి ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *