మన ఈనాడు:18ఏళ్లు నిండినా ఆధార్ కార్డు పొందనివారు ఎక్కువగానే ఉన్నాట్లు సర్కారు గుర్తించింది. అలాంటివారు ఇప్పుడు ఆధార్ (Aadhar) కార్డు సులభంగా లేదు. న్యూ ఆధార్ కార్డు కావాల్సిన వారికి రెండు, మూడు రకాలుగా వెరిఫికేషన్ యూఐడిఐఎ చేయనుంది.
సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ పథకాల పొందాలంటే ఆధార్ కార్డు తప్పనసరి. ఈక్రమంలోనే ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్ గా గుర్తింపు పొందింది. కాగా0 18ఏళ్లు నిండినా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మందే ఉన్నారని అంచనా. అయితే 18ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్త ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆధార్ కార్డుల జారీపై యూఐడీఏఐ కొత్త నిబంధన పెట్టింది. కొత్తగా ఆధార్ తీసుకునేవారికి మల్టిలెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేసింది. పాస్ పోర్టు వెరిఫికేషన్ తరహాలో సిస్టం రూపొందించింది.
ఆధార్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వ్యక్తి ఇంటికి అధికారులు వచ్చి మీ ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునమాను వెరిఫై చేస్తారు.ఆధార్ దరఖాస్తు చేసిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు దాదాపు 180రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త నిబంధనలను 18ఏళ్లకు పైబడి మొదటిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని యూఐడీఏఐ వెల్లడించింది. దేశ భద్రతను పరిగణలోనికి తీసుకుని ఫేక్ పర్సన్స్ కు ఆధార్ కార్డు ఇవ్వకుండా నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.