ట్రైన్​ టిక్కెట్​ బుక్​ అయితేనే..

IRCTC iPay Autopay : రైల్వే టికెట్​ బుకింగ్​లో ఇబ్బందా? టికెట్ కన్ఫామ్​ కాకముందే డబ్బులు కట్ అవుతున్నాయా? రిఫండ్ వెంటనే రావడం లేదా? అయితే మీ కథనం మీ కోసమే. డబ్బులు కట్​ కాకుండా వెయిట్​లిస్ట్​, తత్కాల్ టికెట్లను ఇట్టే బుక్​ చేయొచ్చు. ఒకవేళ మీ టికెట్ బుక్​ కాకముందే డబ్బులు కట్ అయితే ఈ ఫీచర్​తో వెంటనే డబ్బులు రిఫండ్ అవుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో రైల్వే టికెట్​లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని. కొన్నిసార్లు, రైలులో మనకు నచ్చిన సీట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. మరో సమయంలో బుకింగ్ విఫలం కావచ్చు. అప్పుడు టికెట్​ను పొందకుండానే మన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఆ రుసుం తిరిగి వచ్చే విధానం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది.

అయితే ఈ సమస్యలన్నింటికీ సమాధానంగా ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌), ‘ఐపే ఆటోపే'(IRCTC iPay Autopay) అనే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఛార్జీ చెల్లించకుండానే మనం టికెట్ బుక్​ చేసుకోవచ్చు. బుకింగ్ కన్ఫామ్​ అయిన తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. తద్వారా టికెట్​ బుక్​ కాని పరిస్థితుల్లో మనం డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉండదు.

iPay పేమెంట్ గేట్​వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ఆటోపే. దీని ద్వారా ఎక్కువ విలువ కలిగిన లేదా వెయిట్ లిస్ట్​లో ఉన్న టికెట్​లను బుక్​ చేయొచ్చు. మీరు టికెట్​లు బుక్​ చేసినప్పుడు ఈ ‘ఆటోపే’ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. అయితే, టికెట్ బుక్ చేసినా మన ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అవ్వవు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న టికెట్​ ఛార్జీ మొత్తంపై లైయెన్ (lien- మీ అకౌంట్​లోని డబ్బు వేరే చోట ఖర్చు చేయకుండా నియంత్రణ) విధిస్తుంది. మన టికెట్ కన్ఫామ్​ కాకపోయినా, క్యాన్సిల్ అయినా మన డబ్బులపై ఉన్న నియంత్రణ తొలగిపోతుంది.

వెయిట్​లిస్ట్​లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు, అది కన్ఫామ్ కాకపోతే మీ డబ్బులు కట్​ అవ్వవు. ఆటోపే నియంత్రణ తొలగిపోవడం వల్ల మీరు మీ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.వెయిట్ లిస్ట్  కోటాలో వెయిల్​లిస్ట్​లో ఉన్న టికెట్​ బుక్​ చేసినప్పుడు, ఒకవేళ అది కన్ఫామ్ కాకపోతే, మీరు కేవలం క్యాన్సలేషన్ ఫీజు, ఐఆర్​సీటీసీ కన్వీనియెన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు వంటివి కట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.ఇన్​స్టంట్ రిఫండ్ (IRCTC Instant refund) : వెయిట్​లిస్ట్​లో ఉన్న టికెట్ బుక్​ చేసినప్పుడు అవి కన్ఫామ్​ కాకపోతే మన డబ్బులు వెంటనే రిఫండ్ అవుతాయి.

‘ఆటోపే’ ఇలా చేయండి

ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో లాగిన్​ అయ్యి, మీ ప్రయాణ వివరాలను నమోదు చేయాలి.అందులో మీ రైలు, కోచ్​, ప్రయాణికుల వివరాలను నమోదు చేయాలి.ఆ తర్వాత పేమెంట్ బటన్​పై క్లిక్​ చేసి iPayను పేమెంట్ గేట్​వేలా సెలెక్ట్​ చేసుకోవాలి.అనంతరం Autopay, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్​సీటీసీ ముద్ర, నెట్​బ్యాంకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.Autopay ఆప్షన్​తో పాటు పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్) ఎంపిక చేయాలి.పేమెంట్ వివరాలు నమోదు చేస్తే మీ లావాదేవీ పూర్తవుతుంది. వెంటనే మీ బ్యాంకు, టికెట్ డబ్బులపై నియంత్రణ విధిస్తుంది. టికెట్ బుక్​ కాగానే మన ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.

 

Related Posts

Recharge Rates: మొబైల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మొబైల్ యూజర్ల(Mobile Users)కు కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. త్వరలోనే మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు రీఛార్జీల ధరలు(Recharge rates hike) పెంచనున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లోనూ స్మార్ట్ ఫోన్ల వినియోగమూ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు 1GB…

Reliance Jio: యాడ్ ఫ్రీ యూట్యూబ్‌ కోసం జియో కొత్త ఆఫర్

ప్రస్తుతం ప్రపంప వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్(Smart Phones) వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఇండియా(India)లోనూ వీరి సంఖ్య భారీగానే ఉంది. యూజర్లు(Users( తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్నాపెద్దా, చదువున్న, లేకున్నా ప్రతిఒక్కరికి ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *