ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ED అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఈడీ కార్యాలయం వద్ద తోపులాట
ఈడీ కార్యాలయానికి(ED Office) కేటీఆర్ వస్తున్నారన్న విషయం తెలుసుకన్న BRS నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఈడీ ఆఫీస్ వద్ద సుమారు 200 మంది పోలీసులు మోహరించారు.
#BRS leaders raising slogans against the government at ED office. #KTR @XpressHyderabad @NewIndianXpress @Kalyan_TNIE @santwana99 @sriloganathan6 pic.twitter.com/Sh6nRzZFuf
— Revanth Chithaluri (@iRe1th) January 16, 2025
కేటీఆర్ ఏం చెబుతారు.. సర్వత్రా ఆసక్తిగా
కాగా, ఫార్ములా-ఈ రేస్ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్, BNL రెడ్డిలను ED ఇప్పటికే విచారించింది. వారు ఇద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ ఇవాళ KTRని ప్రశ్నిస్తోంది. అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డి ఇద్దరూ తమ తప్పేమీ లేదని.. కేటీఆర్ బలవంతంతోనే అలా చేశామని చెప్పారు. ఈ నేసథ్యంలో నేడు కేటీఆర్ ఏం చెబుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఫెమా రూల్స్‌ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలించారని ఆయనపై ఉన్న అభియోగం. ఈ కేసులో KTRపై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయింది. ఫార్ములా ఈ రేస్(Formula E Race)లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.








