Old Vehicles: మీ వెహికల్‌ కొని 15 ఏళ్లు దాటిందా.. అయితే స్ర్కాప్‌కి ఇచ్చేయాల్సిందే!

ManaEnadu: మీ వాహనం కొని 15 ఏళ్లు(15 Years) దాటిపోయిందా? ఇంకా ఆ పాత వాహనాలనే వాడుతున్నారా? అయితే మీరిక కొత్త వాహనాలను కొనుక్కోవాల్సిందే. లేకపోతే భారీ జరిమానా(Fine) చెల్లించాల్సి కూడా రావొచ్చు. ఇంతకీ ఎందుకో తెలుసా.. 15 ఏళ్లు లైఫ్ దాటిన వాహనాలను(Vehicles beyond 15 years life) ఇకపై రోడ్లపై తిరగనీయొద్దని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కొత్త నిబంధనలు(New Rules) తీసుకురానుంది. వాహనాలు తయారుచేసి 15 ఏళ్ల సమయం దాటితే అవి ప్రమాదకరంగా, కాలుష్య(pollutant) కారకంగా మారతాయి. ఇటువంటి వాహనాలు రోడ్ల(Roads)పై తిరిగితే ఉపేక్షించవద్దని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఈ వాహనాల జీవిత కాలపరిమితి(Life span of vehicles)పై వచ్చే ఏడాది ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.

వాహనాలు కొనుగోలు చేసి 15 సంవత్సరాలు దాటితే వాటిని తుక్కు కింద మార్చాలి. అలాగే, వాటి రిజిస్ట్రేషన్‌ రద్దయిపోతుంది)Registration will be cancelled). అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది. వాహనాల యజమానులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. వాహనాన్ని స్క్రాప్‌(scrap)కి ఇచ్చేయాలి. అలాగాకుండా ఆ వాహనాలతోనే రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క Greater Hyderabad నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల Bikes, 3.5 లక్షల Carsతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి.

అయితే, ఫిట్‌నెస్ పరీక్షలో వాహనం పాస్ అయితే గ్రీన్ ట్యాక్స్(Green tax) చెల్లించి, ఆ వాహనాన్ని అదనంగా 3-5 సంవత్సరాలు వాడుకోవడానికి అనుమతి పొందవచ్చు. అయితే, 15 ఏళ్లు నిండిన తర్వాత స్క్రాప్ చేయాల్సిన దాదాపు 10 వేల ప్రభుత్వ వాహనాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. ఈ మేరకు ప్రాంతీయ రవాణా అథారిటీ వాహన స్క్రాపేజ్ విధాన ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసి దాని ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం, 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించని ఏకైక రాష్ట్రంగా ఢిల్లీ ఉంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర, UP, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాలు TGలో ఇప్పుడు ప్రతిపాదించిన విధానం వంటి నిబంధనలనే అమలు చేస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *