Mana Enadu: పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan cricket team)కు షాక్ తగిలింది. ఇటీవల వరుస పరాజయాలు చవిచూస్తోన్న ఆ జట్టుకు కోచ్ గ్యారీ కిర్‌స్టన్(Coach Gary Kirsten) ఇకపై ఆ జట్టుతో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఆటగాళ్ల మధ్య విభేదాలతోపాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) వైఖరి తనకు నచ్చడం లేదని గ్యారీ పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికా(South Africa)కు చెందిన గ్యారీ కిర్‌స్టన్ గురించి టీమ్ఇండియా(Team India) అభిమానులకు స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. 2011లో వన్డే ప్రపంచకప్(2011 ODI World Cup) ధోనీ సేన గెలవడంలో కోచ్‌గా కిర్‌స్టన్ కీలక పాత్ర పోషించాడు. కోచ్‌గా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆయన్ని PCB ఏరి కోరి మరి తెచ్చుకుంది. అయితే.. మరో ఆరునెలల పదవీకాలం ఉన్నప్పటికీ అతడు కోచ్ పదవికి రాజీనామా ప్రకటించాడు.
వరుస పరాజయాలే కారణమా..
2024లో పాకిస్థాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన కిర్‌స్టన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్(T20 series with Ireland) గెలిచిన పాకిస్థాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత T20WC 2024లో అమెరికా, భారత్‌లపై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇటీవల బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్(Test series against Bangladesh)లోనూ ఆ జట్టు వైట్ వాష్‌కు గురైంది. దీంతో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఆ జట్టు పని అయిపోయిందంటూ పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.
The Pakistan Cricket Board today announced Jason Gillespie will coach the Pakistan men’s cricket team on next month’s white-ball tour of Australia after Gary Kirsten submitted his resignation, which was accepted.
— Pakistan Cricket (@TheRealPCB) October 28, 2024
జేసన్ గిలెస్పీకి కోచ్ బాధ్యతలు
పాక్ వరుస ఓటములకు ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదని, PCB సైతం తన డిమాండ్లను ఒప్పుకోకపోవడంతోనే కిర్‌స్టన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆయన రాజీనామాను కూడా PCB వెంటనే ఆమోదించడం గమనార్హం. అతడి స్థానంలో టెస్టు జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)కి అదనపు బాధ్యతలు అప్పగించింది. మూడు ఫార్మాట్లకు ప్రస్తుతం గిలెస్పీ కోచ్‌గా కొనసాగనున్నాడు. మరో నాలుగు నెలల్లో సొంతగడ్డపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జరగనున్న వేళ కోచ్ రాజీనామా చేయడం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. కాగా.. బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ ODI, T20 జట్లకు కెప్టెన్‌గా ప్రకటించిన 24 గంటల్లోనే కిర్‌స్టన్ తప్పుకోవడం గమనార్హం.








