War2: నేడు వార్-2 నుంచి ‘ఊపిరి ఊయ‌ల‌గా’ సాంగ్ రిలీజ్.. ఎన్టీఆర్ట్ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ NTR కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖ‌ర్జీ(Ayan Mukherjee) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) మూవీని నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా న‌టించింది. ఆగ‌స్టు 14న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. రిలీజ్‌కు ఇంకా 15 రోజులే మిగిలి ఉండ‌డంతో మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక ఆగస్టు 10న విజయవాడలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-Release Event) నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

War 2 Trailer Review: Hrithik Roshan and Jr NTR Set the Stage for India's  Biggest Action Showdown

ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతా..

ఇప్ప‌టికే మూవీ ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశారు. ముఖ్యంగా ట్రైలర్‌(War 2 Trailer)లో ఎన్టీఆర్​, హృతిక్​ పోటాపోటీగా తలపడ్డారు. ‘ఎవరూ చేయలేని పనిని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను’ అంటూ NTR పవర్​ఫుల్​ డైలాగ్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్​ కియారా అడ్వాణీ (Kiara Advani) మరింత అందంగా కనిపించడమే కాదు.. యాక్షన్​‌తోనూ అదరగొట్టింది. తాజాగా కియారా, హృతిక్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. తెలుగులో ‘‘ఊపిరి ఊయ‌ల‌గా’’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను తార‌క్ త‌న ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. “ప్రేమ అప్రయత్నంగా ఉన్నప్పుడు, అది ఒక కలలా అనిపిస్తుంది… ఈ రోజు (జులై 31) విడుదలయ్యే ఊపిరి ఊయలగా పాట కోసం సిద్ధంగా ఉండండి!” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *