విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్(Kingdom)’ మూవీ ఈరోజు (జులై 31) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్. సత్యదేవ్(Satyadev), వెంకటేష్ కేవీ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ బాక్సాఫీస్ హిట్ కొట్టాలనే పట్టుదలతో నటించిన కింగ్డమ్ ఎలా ఉంది? గౌతమ్ కింగ్డమ్‌లో విజయ్ కింగ్‌గా నిలిచాడా? లేదా? బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? అనే విషయాలను సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
Welcome to the #Kingdom World ❤️
Celebrate the emotions that are going to hit you hard 🫶🏻
WORLDWIDE GRAND RELEASE TODAY 👑❤️🔥
🎟️ – https://t.co/4rCYFkA5dI@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon #GirishGangadharan… pic.twitter.com/MRsnu4Mxf9
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
‘కింగ్డమ్’ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ దేవరకొండ నటన బాగుందంటూ కొందరు ఫ్యాన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా, తన సోదరుడి కోసం ఒక మిషన్‌లో ఉన్న పాత్రలో కనిపించాడు. అతని రెండు విభిన్న షేడ్స్‌లోని నటన ఆకట్టుకుందని కొందరు పోస్ట్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారని వారి నటన కూడా సినిమాకు బలం చేకూర్చిందని మరికొందరు అంటున్నారు. సినిమాటోగ్రఫీ, VFX లు విజువల్‌గా ఆకర్షణీయంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొంతమంది ప్రేక్షకులు కథలో కొత్తదనం లోపించిందని, కొన్ని సన్నివేశాలు ఊహించిన విధంగానే సాగాయని అంటున్నారు.
#Kingdom First Half:
Well-executed intro, emotionally grounded brotherhood, and a balanced romantic track.
Anirudh’s background score stands out..
VD’s delivers a focused and mature performance.And it already feels like a storm is coming in the second. Kingdom is rising!
— Jaswanth (@jaswanth07_) July 30, 2025
కొందరు అభిమానులు “విజయ్ యాక్షన్ కమ్‌బ్యాక్ లోడింగ్!” అంటూ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు, అయితే కొందరు సినిమా మరింత బలమైన కథతో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. మంచి ఇంట్రడక్షన్ సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్‌లో కింగ్డమ్‌ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది.
#Kingdom first half — if this momentum keeps up, Vijay Devarakonda is staring at a power-packed comeback. This is SOLID cinema. pic.twitter.com/5Pxrkq9dMI
— LetsCinema (@letscinema) July 30, 2025
సూరి పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నదమ్ముల అనుబంధంతో కూడిన ఎమోషన్స్, హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటున్నాయి. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారని ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గౌతమ్ తిన్ననూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారని, ఎమోషన్స్‌తో పాటుగా యాక్షన్ కూడా బ్యాలన్సుడ్‌గా హ్యాండిల్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడంటున్నారు. చాలా సన్నివేశాలను తనం బీజీఎమ్‌తో ఎలివేట్ చేశాడని చెబుతున్నారు.
The second half takes off like fire in that boat scene. VD’s performance pure madness. That DOP… insane brilliance!
Anirudh took it personally and unleashed a storm.
Tomorrow, both Telugu states will burn with this hype.🔥#Kingdom#KingdomOnJuly31st
— Jaswanth (@jaswanth07_) July 30, 2025






