ఇంగ్లండ్(England)తో మూడో వన్డేలో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) సూపర్ సెంచరీ(Century)తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న గిల్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్క్ ఉడ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ మార్కు అందుకున్న గిల్ వన్డే(ODI)ల్లో తన 7వ శతకం నమోదు చేశాడు. కాగా ఈ సిరీస్ తొలి వన్డేలో 87 పరుగులతో రాణించగా.. రెండో వన్డేలో 60 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చివరిదైన మూడో వన్డేలో ఇవాళ 112 పరుగులు చేశాడు.
Subhman Gill is now became a Mr consistent in Indian cricket 🏏 #ShubmanGill #INDvsENG
— ANKITA KUMARI (@ankitajkhs) February 12, 2025
అత్యంత వేగంగా 2,500 పరుగులు పూర్తి
అంతేకాదు, ఒక స్టేడియంలో మూడు ఫార్మాట్లలో సెంచరీ(A century in all three formats at one stadium) చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత అందుకున్నాడు. గతంలో ఈ ఫీట్ ను ఫాఫ్ డుప్లెసిస్ (వాండెరర్స్-జొహాన్నెస్ బర్గ్), డేవిడ్ వార్నర్ (అడిలైడ్ ఓవల్), బాబర్ అజామ్ (కరాచీ నేషనల్ స్టేడియం), క్వింటన్ డికాక్ (సూపర్ స్పోర్ట్ పార్క్-సెంచూరియన్) నమోదు చేశారు. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం(Narendra Modi Stadium, Ahmedabad )లో శుభ్ మన్ గిల్ ఈ ఘనత సాధించాడు. అలాగే వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆమ్లా 53 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత అందుకోగా గిల్ 50 ఇన్నింగ్సుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
IND vs ENG 3rd ODI: India batter Shubman Gill surpasses SA’s Hashim Amla to become fastest to score 2500 ODI runs#INDvsENG | #ShubmanGill
READ:https://t.co/UCwFCIWNk9https://t.co/UCwFCIWNk9
— WION Sports (@WIONSportsNews) February 12, 2025






