
ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే వారు పనిలో శ్రద్ధ చూపిస్తారు. వారు శ్రద్ధగా పని చేస్తేనే సంస్థ అభివృద్ధి బాటలో నడుస్తుంది. అందుకే చాలా కంపెనీలు ఖర్చు ఎక్కువైనా సరే ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కంపెనీలు మాత్రం తమ ఎంప్లాయిస్ కోసం రకరకాల లీవ్స్ ను ఇస్తుంటాయి. తాజాగా ఓ కంపెనీ కూడా ఇలాంటి ఓ ప్రయత్నమే చేసింది.
ఫ్రీగా ఆల్కహాల్
జపాన్ (Japan)కు చెందిన ట్రస్ట్ రింగ్ అనే సంస్థ తమ ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్‌ను అందిస్తోంది. అంతేకాకుండా తప్పతాగిన తర్వాత హ్యాంగోవర్ రావడం ఖాయం. ఇక హ్యాంగోవర్ లో పని చేయడం కష్టమే. అందుకే ఉద్యోగులకు ఈ కంపెనీ హ్యాంగోవర్ లీవ్ (Hangover Leave) కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా అధికంగా మద్యం తాగితే ఈ లీవ్‌ను ఉపయోగించుకొని మత్తు దిగాక తిరిగి ఆఫీసుకు వచ్చి పని చేయాలని సూచించింది.
అందుకే హ్యాంగోవర్ లీవ్
ఇక ఈ హ్యాంగోవర్ లీవ్ తమకు బాగా ఉపయోపగడుతోందని ఉద్యోగులు అంటున్నారు. ఈ సెలవు సాయంతో రెండు మూడు గంటలు హాయిగా నిద్రపోతున్నామని.. ఆఫీసుకు వచ్చాక సమర్థంగా పని చేయగలుగుతున్నామని చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన ప్రారంభంలోనే ఎక్కువ జీతం ఇచ్చుకోలేకే ఈ హ్యాంగోవర్ లీవ్ ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొంది.