ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో టీమ్ఇండియా(Team India) పట్టు బిగించింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్(England)తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ సేన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో చెలరేగాడు. దీంతో నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసి, తొలి ఇన్నింగ్స్ 180 రన్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
గిల్.. సూపర్ ఇన్నింగ్స్
కాగా ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 269 పరుగులతో అద్భుత నాక్ ఆడాడు. ఇది ఇంగ్లండ్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 161 పరుగులతో మరో సెంచరీ సాధించి, రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ కూడా మంచి ఇన్నింగ్స్‌లతో జట్టుకు బలం చేకూర్చారు. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. జామీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (158) శతకాలతో రాణించినప్పటికీ, మహమ్మద్ సిరాజ్ (6/70), ఆకాశ్ దీప్ (4/88) బౌలర్లు ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.
They call him Prince but at the moment he is batting like an absolute emperor 😮💨
17th International 100 for Shubman Gill#ShubmanGill #ENGvsIND
pic.twitter.com/xt5rdB3ZET— Prateek (@prateek_295) July 5, 2025
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నాల్గవ రోజు ముగిసే సమయానికి 72/3 స్కోరుతో కష్టాల్లో ఉంది. ఆ జట్టు విజయానికి ఇంకా 536 పరుగులు అవసరం. ఆకాశ్ దీప్ రెండు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీసి భారత్‌ను ఆధిపత్య స్థానంలో నిలిపారు. ఈ మ్యాచ్‌లో గిల్ నాయకత్వం, బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో భారత్ సిరీస్‌ను సమం చేసే దిశగా దూసుకెళ్తోంది.
Akash Deep You Beauty ❤️🔥
he knocked the No.1 ranked batter in Test cricket Joe root #ENGvsIND pic.twitter.com/XueVCTJ0WZ— Srã Õñê (@crict_enthst_14) July 5, 2025






