పసిడి ప్రియులకు షాక్.. రూ.లక్షకు చేరువలో బంగారం ధర

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఇంకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లలో నెలకొంటున్న అనిశ్చితితో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పసిడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధర ఇవాళ భారీగా పెరిగి పుత్తడి కొనుగోలు చేయాలనుకున్న వారికి షాక్ ఇచ్చింది. ఇక బంగారంతో పాటే వెండి కూడా భారీగా పెరిగింది.

రూ.1,140 పెరిగిన పసిడి ధర

దేశవ్యాప్తంగా పసిడి ధరలు (Gold Rates Today) గురువారం రోజున భారీగా పెరిగాయి. హైదరాబాద్ మహానగరంలో బుధవారం నాడు రూ.96,170 ఉన్న గోల్డ్ రేటు గురువారం నాటికి రూ.1,140 పెరిగి ప్రస్తుతం రూ.97,310 వద్ద పలుకుతోంది. మరో రెండు మూడు రోజుల్లో పసిడి ధర లక్ష రూపాయలకు చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ శుభకార్యాల సీజన్ లో చాలా మంది పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రారని అంటున్నారు. ఇక ఈ ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

రూ.2వేలు పెరిగిన సిల్వర్ రేటు

మరోవైపు బంగారానికి ఏ మాత్రం తీసిపోను అంటూ వెండి (Silver Price Today) కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుముఖం పట్టి కొన్ని రోజులు స్థిరంగా సాగిన సిల్వర్ రేటు తాజాగా భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరంలో కిలో వెండి ధర బుధవారం రోజున రూ.91,938 ఉండగా, గురువారం నాటికి రూ.2,708 పెరిగి ప్రస్తుతం రూ.94,646 వద్ద పలుకుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *