
అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధరలు (Gold Price Today) కొంతకాలంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటోంది. దీని కారణంగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి మీరు పుత్తడి కొనాలి అనుకుంటున్నారా..? మరి మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
పసిడి ధర ఎంతంటే?
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల పసిడి రేటు (Gold Rate ) 10 గ్రాములు రూ.80,000కు చేరింది. మరోవైపు దిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.87.860 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.80,550 వద్ద పలుకుతోంది.
స్థిరంగా వెండి ధరలు
బంగారమే కాదు వెండి ధరలు (Silver Price Today) కూడా ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,08,100కు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.99,100 వద్ద పలుకుతోంది. మార్కెట్లో క్షణక్షణానికి బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. మరి మీరు కొనుగోలు చేసేటప్పుడు ధర ఎంత ఉందో పరిశీలించి కొనండి.