Shama Mohamed: మొన్న రోహిత్‌ బాడీపై కామెంట్స్.. నేడు ప్రశంసల వర్షం

ఇటీవల టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma)పై అవమానకర కామెంట్స్ చేసిన కాంగ్రెస్(Congress) మహిళా నేత షామా మహ్మద్(Shama Mohamed) టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను కాంగ్రెస్ నేత షామా మహ్మద్ అభినందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు భారత జట్టుకు సోషల్ మీడియా(SM)లో ఆమె అభినందనలు తెలియజేశారు. 76 పరుగులతో రాణించి అద్భుత విజయాన్ని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మకు షామా సెల్యూట్ చేశారు. అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయపథంలో నడిపించారంటూ కాంగ్రెస్ నేత షామా ప్రశంసలతో ముంచెత్తారు.

హిట్‌మ్యాన్ లావుగా ఉంటాడంటూ..

కాగా ఇటీవల ఆమె రోహిత్‌పై ఆమె.. . హిట్ మ్యాన్ లావుగా ఉంటాడు. ఫిట్ నెస్(Fitness) కూడా ఉండదు. అసలు కెప్టెన్‌గా పనికిరాడంటూ తీవ్రంగా అవమానించారు. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలను సమర్థించలేదు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహ్మద్ ఒక దిగ్గజ క్రికెటర్ గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా(Congress spokesperson Pawan Khera) అన్నారు. ఆ ట్వీట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి వెంటనే డిలీట్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. ఆ తర్వాత ఆమె రోహిత్‌కు క్షమాణలు చెప్పి, తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.

I am not retiring from ODIs: Rohit Sharma puts rumours to bed after  Champions Trophy

కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” దక్కింది. రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *