
బంగారం (Gold) కొనాలనుకుంటున్నారా..? ఐతే మీకు కాస్త ఊరటనిచ్చే వార్త. శనివారం రోజున పసిడి ధరలు (Gold Price Today) కాస్త తగ్గుముఖం పట్టాయి. పుత్తడి రేట్లలో ఏకంగా రూ.400 తగ్గుదల కనిపించింది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శనివారం రోజున వెండి ధర (Silver Price Today) రూ.200 తగ్గింది. దేశవ్యాప్తంగా శుక్రవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, శనివారం నాటికి రూ.400 తగ్గి రూ.87,300 వద్ద పలుకుతోంది. ఇక కిలో వెండి ధర శుక్రవారం నాడు రూ.96,300 ఉంది. శనివారం రోజున రూ.200 తగ్గి రూ.96,100 వద్ద అమ్ముడుపోతోంది.
రూ.లక్ష చేరుతుందా?
ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కాస్త తగ్గుదల కనిపించడంతో ఇప్పుడే పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం ఉత్తమం అని సామాన్యులు భావిస్తున్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో బంగారం కొనడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇక పుత్తడి ధర 10 గ్రాములు త్వరలోనే లక్ష రూపాయలు చేరుకుంటుందనే వార్తలతో మరింత భయపడుతున్నారు మధ్యతరగతి ప్రజలు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.87,300.. కిలో వెండి ధర రూ.96,100
- విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.87,300.. కిలో వెండి ధర రూ.96,100
- విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.87,300.. కిలో వెండి ధర రూ.96,100
- ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.87,300.. కిలో వెండి ధర రూ.96,100గా ఉంది.