కొనుగోలుదారులకు బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి. గత మూడు రోజులు తగ్గుతూ వచ్చిన పుత్తడి రేట్లు ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు కంగు తిన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిమాణాలతో బంగారం ధరల్లో రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు(Market Experts) చెబుతున్నారు. దీంతో పసిడి ప్రియులకు కొనుగోలు చేసే విషయంలో కొంచెం గందరగోళం నెలకొంటోందని అంటున్నారు.
కాగా బుధవారం (జూన్ 11) హైదరబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 820 పెరిగి రూ.98,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ. 90,200 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి(Silver)పై రూ.100 పెరిగి రూ.1,19,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అటు ఒక అమెరిన్ డాలర్‌కు రూపీ వ్యాల్యూ(Rupee Value) రూ. 85.63గా నమోదైంది.






