బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత రెండు రోజులు తగ్గిన పసిడి రేటు శుక్రవారం రూ.1200కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి డిమాండ్ ఏర్పడింది. కానీ ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా ఈరోజు (May 16) హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.87,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.95,130కి చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇక బంగార కొన్నట్లే అంటూ షాకవుతున్నారు. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.1,08,000గా కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 95,280కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.87,350గా పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ.97,000గా నమోదైంది. ఇక నిన్నటితో పోలిస్తే రూపీ వ్యాల్యూ(Rupee Value) కాస్త మెరుగుపడింది. దీంతో ఇవాళ ఒక US డాలర్‌కు రూ.85.57గా ఉంది.






