Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రేత్రలు అమ్మకాలు తగ్గుతున్నాయని చెబుతున్నట్లుగా ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌(India Bullion and Jewelers Association) వర్గాలు కూడా తెలిపాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా కొనుగోళ్లు మందగించాయి. ఈ సమయంలో కొనుగోలుదారులకు నేడు (ఫిబ్రవరి 15) గోల్డ్ రేట్స్ కాస్త ఊరటనిచ్చాయి.

రెండు రకాలపై రూ. వెయ్యి చొప్పున తగ్గింపు

ఇవాళ బంగాకం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000 తగ్గి రూ. 78,900వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి(Pure Gold) ధర రూ.1,090 తగ్గి రూ. 86,070వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్లా ఇవే ధరలు ఉండనుండగా.. కొన్ని చోట్ల స్వల్ప మార్పులు ఉండవచ్చు. అటు సిల్వర్ ధర(Silver Price)ల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇవాళ కేజీ వెండి ధర రూ. 1,08,000గా ఉంది. ఒక రూపీ వ్యాల్యూ(Rupee Value) సైతం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇవాళ ఒక యూఎస్ డాలర్‌కు రూ.86.78గా ఇండియన్ రూపీ వ్యాల్యూ కొనసాగుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *