గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయికి చేరుకున్న పసిడి ధరలు (Gold Rates) ఏప్రిల్ నెల మొదటి వారంలో గణనీయంగా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump Tariffs) సుంకాల విధింపుతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే గత వారం రోజుల నుంచి పుత్తడి రేట్లలో స్వల్పంగా తగ్గుముఖం కనిపిస్తోంది. 20 శాతం వరకు పెరిగిన గోల్డ్ ధరలు ప్రాఫిట్ బుకింగ్ వల్ల దిగొస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
స్థిరంగా బంగారం ధరలు
మనదేశంలో ఏప్రిల్ 4, 5వ తేదీల్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఆ తర్వాత రెండ్రోజులు కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,380 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర సోమవారం రోజున రూ.82,850 వద్ద విక్రయిస్తున్నారు. ఇక పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. సిల్వర్ రేట్లు (Silver Rates Today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 1.03 లక్షలు పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఏపీలోని విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.91,116గా ఉండగా.. కిలో వెండి ధర రూ.91,420గా ఉంది. విశాఖపట్నంలో తులం గోల్డ్ రేటు రూ.91,116.. కేజీ సిల్వర్ ధర రూ.91,420 వద్ద పలుకుతోంది. ఇక ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.91,116గా ఉంది. కిలో వెండి ధర రూ.91,420 వద్ద వ్యాపారులు విక్రయిస్తున్నారు.






