
బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ప్రస్తుతం రూ.89 వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం శుభ కార్యాల సీజన్ కావడంతో అది కాస్త రెట్టింపు అయింది. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పుత్తడి కొనాలంటేనే జంకుతున్నారు. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా బంగారంపై దిగుమతి సుంకం తగ్గడమే ఇందుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు(Gold Rates) ఇవాళ (మార్చి 11)న ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..
రెండు రాష్ట్రాల్లోని వారికి కాస్త ఊరట
హైదరాబాద్(HYD)లో ఇవాళ గోల్డ్ రేట్స్ కాస్త దిగివచ్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడిపై రూ.330 తగ్గి రూ. 87,490 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 300 తగ్గి రూ.80,200 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గి రూ.80,200 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ. 330 తగ్గి రూ.87,490 వద్ద ఉంది. ఇక కిలో కేజీ వెండి(Silver Price) ధర రూ.1000 తగ్గి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది.