
రిలయన్స్ జియో(Reliance Jio) తమ యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త రీఛార్జ్ ప్లాన్(New recharge plan)ను అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే ఇది కాల్స్(Calls) చేసుకునే వారి కోసం మాత్రం కాదు. OTT ప్రియుల కోసం మాత్రమే అని సంస్థ ప్రకటించింది. జియోహాట్‌స్టార్(JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫాంలో సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటున్న వారికి ఇదో గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు కేవలం రూ.100 ప్లాన్ తీసుకుంటే ఉచితంగా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలకు కూడా పొందవచ్చు అవేంటంటే..
ఓటీటీ కంటెంట్ చూడొచ్చు..
జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ కలిసిన తర్వాత స్ట్రీమింగ్ సర్వీసులు ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ద్వారా స్ట్రీమింగ్ సర్వీసుల కోసం నెలవారీ లేదా వార్షిక ప్లాన్(Monthly Plan)లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోకుండానే యాడ్-సపోర్టెడ్ కంటెంట్(Ad-supported content)ను ఉచితంగా చూడవచ్చు. రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా జియోహాట్‌స్టార్ కాంప్లిమెంటరీని పొందవచ్చు. మొబైల్ వినియోగదారులు(Users) ఈ రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ కంటెంట్(JioHotstar Content)ను చూడడానికి వాడుకోవచ్చు.
90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.. కానీ
అయితే, కంటెంట్ మధ్యలో యాడ్స్(Adds) వస్తుంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ(Validity) 90 రోజులు అయినప్పటికీ ఈ రీఛార్జితో మొత్తం 5GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా(High-speed internet data) మాత్రమే అందుతుంది. అది డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజ్ వంటి సౌకర్యాలు పొందడానికి మాత్రం వీలుండదు. ఈ కాంప్లిమెంటరీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మొబైల్‌తో పాటు TVల్లోనూ పనిచేస్తుంది. సాధారణంగానైతే జియో హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ నెలరోజులకుగానూ రూ.149 నుంచి ఉందన్న విషయం విదితమే. ప్రీమియం ప్లాన్(Premium plan) కావాలనుకునే వారు నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ. 1,499 చెల్లించాలి.
📢📢📢 Jio New Plan Update :
Rs 100 Plan – 5GB data + FREE JioHotstar Mobile/TV subscription for 90 days!🥳
✅Only Data Pack – No Calls/SMS ❌
Rs.100 Plan : 5 GB Data + Free Jio Hotstar for 90 Days(Mobile/TV)
Rs.195 Plan : 15 GB Data + Free JioHotstar for 90 Days (Mobile/TV) pic.twitter.com/TGljtLoKpd
— Shop K Deals (@shopkdeals) March 9, 2025