
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(Ration Cards) పంపిణి వేగంగా ముందుకు కొనసాగుతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలలో ‘గృహజ్యోతి’ పథకం ఎంతో కీలకమైనది. ఈ పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి. ఈ నేపథ్యంలో.. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ‘గృహజ్యోతి’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Electricity Scheme) ను ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా, తాజాగా కొత్త రేషన్ కార్డు(New Ration Card) పొందినవారికి దరఖాస్తు విధానం తెలుసుకోవడం అవసరం. అయితే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారు.. ఆ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియదు.. అయితే ఇక్కడ గృహజ్యోతి పథకానికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం..?
ఫారమ్ పొందడం:
అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేయవచ్చు. లేదా సమీప మున్సిపల్ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచీ తీసుకోవచ్చు.
కావలసిన పత్రాలు:
‘గృహజ్యోతి’ పథకానికి సంబందించిన దరఖాస్తు ఫారంతో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ వివరాలు.. ప్రస్తుత లేదా గత నెల కరెంట్ బిల్లు రశీదును జత చేయాల్సి ఉంటుంది.
ఫారమ్ అందచేయడం:
పూర్తి వివరాలను నింపిన తర్వాత.. ఆ దరఖాస్తు ఫారంను మున్సిపల్ కార్యాలయంలో(పట్టణ ప్రాంతాల్లో), గ్రామ పంచాయతీ లేదా మండల కార్యాలయంలో అందించవచ్చు. ఏవైనా సందేహాలుంటే విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మండల అధికారులు సహాయం చేస్తారు.
‘గృహజ్యోతి’ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం ఉచితంగా లభిస్తుంది. ఒకసారి 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా విద్యుత్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కనుక అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి.