
పాకిస్థాన్(Pakistan)తో యుద్ధ వాతావరణం(War Situation) నెలకొన్న వేళ భారత్(India) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దేశప్రజలకు ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎలా స్పందించాలనే తదితర విషయాలపై రేపు (మే 7)న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహించనుంది. దీంతో రేపు దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్(War Siren) మోగనుంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్(Hyderabad)లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్(Civil Defense Districts)లో మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్ బృందాలు మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో..
రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 259 ప్రదేశాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రిహార్సల్స్(Civil Defense Mock Drill Rehearsals) చేపట్టింది. యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా ఉండాలనే దానిపై అవగాహన కల్గిస్తున్నారు. మాక్ డ్రిల్స్‌లో ఎంపిక చేసిన ప్రజలకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఒక ఏరియా నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైనా ట్రైనింగ్(Training) ఉంటుంది. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేశారు.
Air Raid Siren Drill in Hyderabad Tomorrow at 4 PM Under ‘Operation Abhyaas’
The Government of Telangana, as part of a nationwide civil defence preparedness programme, will conduct a mock air raid drill tomorrow, May 7, 2025, at 4:00 PM across Hyderabad city. The exercise,… pic.twitter.com/hY0p3sPACn
— Sudhakar Udumula (@sudhakarudumula) May 6, 2025