
IPL 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ప్లేస్‌లో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. అటు ముంబై ఇండియన్స్ మాత్రం అదే జట్టుతో ఆడుతోంది. కాగా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఈ రెండు జట్లూ ఏడేసి చొప్పున విజయాలతో మూడు, నాలుగో ప్లేసులో ఉన్నాయి. ఇవాళ గెలిచిన జట్టు ప్లేఆఫ్స్(Play Offs) బెర్తును ఖరారు చేసుకుంటుంది.
తుది జట్లు ఇవే..
Gujarat Titans: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(C), జోస్ బట్లర్(W), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
Mumbai Indians: ర్యాన్ రికెల్టన్(W), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
🚨 Toss 🚨@gujarat_titans won the toss and elected to field against @mipaltan
Updates ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/rnOezltlvv
— IndianPremierLeague (@IPL) May 6, 2025