Mana Enadu: తెలంగాణ(Telangana)లో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్(Group1 Mains Exams) జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల(Exam Centers) వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200M వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.
పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
కాగా మొదటిరోజైన ఇవాళ ఇంగ్లిష్ (Qualifying Test) పరీక్ష, ఆ తర్వాత సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మొత్తం 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రభుత్వం 46 పరీక్షా కేంద్రాలు (HYD జిల్లాలో 8, RR జిల్లాలో 11, మేడ్చల్ జిల్లాలో 27) ఏర్పాటు చేసింది. ఈ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద SIల నేతృత్వంలో స్పెషల్ ఫోర్స్(Special Forces)లను రంగంలోకి దింపారు. వీరికి అదనంగా పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్(Flying Squad) బృందం తరచూ సందర్శిస్తుంచనుంది. పరీక్షల పర్యవేక్షణకు 3 కమిషనరేట్లలో ఒక్కో DCPని నోడల్ అధికారిగా నియమించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లను తరలించే వాహనాలకు తొలిసారిగా GPS ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. వీటిని TGPSC ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి(Mahender Reddy) పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 తర్వాత గేట్లు మూసివేయనున్నారు. మ. 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలపై అభ్యర్థులు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.