Mana Enadu: బిర్యానీ(Biryani).. అబ్బా ఈ పేరు వింటేనే నోరూరుతుంది. పైగా బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఏ చిన్న స్పెషల్ అకేషన్(Special occasion) వచ్చినా సరే బిర్యానీ తినాల్సిందే. అలాగే ఇంట్లో ఏ చిన్న వేడుక(celebrations) జరిగినా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్(emotion). ఫిష్, మటన్, ప్రాన్స్, కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ అంటూ ఏరియాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ అంటే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు.
ఈ మధ్య ఇవి సాధరణమైపోయాయండీ..
సాధారణంగా చికెన్ బిర్యానీ(Chicken biryani) వండాలంటే చికెన్‌తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలుతో చేస్తుంటారు. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రీలు, బల్లులు, బొద్దింకలతో చికెన్ బిర్యానీలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్(HYD)లోని ఓ రెస్టారెంట్(Restaurant)లో చికెన్ బిర్యానీ జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్ మీడియా(Social media)లో హల్చల్ చేస్తోంది. ఆ జెర్రీ విషయాన్ని మర్చిపోకముందే, బిర్యానీలో చనిపోయిన కప్ప అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/FoodIIITHyd/status/1846914168089133166
ఆలస్యంగా వెలుగులోకి
హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మెస్(Hyderabad Gachibowli Triple IT Campus Mess)లోని బిర్యానీలో కప్ప(Frog) కనిపించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి మెస్‌లో చికెన్ బిర్యానీ తింటుండగా కప్ప దర్శనమివ్వడంతో నివ్వెరపోయారు. దీనిపై క్యాంపస్, ఫుడ్ సేఫ్టీ అధికారుల(Food Safety Officers)కు విద్యార్థులంతా ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ఆ ఫొటోను చూస్తే ఏకంగా బిర్యానీతో పాటు వండేసినట్లు తెలుస్తోంది. ఇది సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.