బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు మరోసారి చంద్రబాబు.. తోడుగా పవన్ కల్యాణ్!

Mana Enadu : నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో మరోవైపు ఓటీటీలో ప్రోగ్రామ్స్​తో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాబీతో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఇటీవలే బోయపాటితో అఖండ-2 (Akhanda) సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నా.. ఆహా ఓటీటీలో వచ్చే అన్​స్టాపబుల్ టాక్ షో(Unstoppable With NBK)కు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మూడు సీజన్లు సూపర్ హిట్​గా నిలిచిన విషయం తెలిసిందే.

అన్​స్టాపబుల్ సీజన్-4

పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్(Prabhas), రానా వంటి స్టార్ హీరోలు.. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ నేతలు ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోతో ప్రేక్షకుల్లో బాలయ్య రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలయ్యను మరో కోణంలో ఈ షో ఆవిష్కరించింది. ఇటీవలే అల్లు అరవింద్ కోసమే ఈ షో కంటిన్యూ చేస్తున్నా అని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందట.

అన్​స్టాపబుల్​లో మరోసారి చంద్రబాబు

నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ మొదట అల్లు అర్జున్(Allu Arjun)​తో స్టార్ అవుతుందని టాక్ నడిచింది. కానీ తాజాగా మొదటి ఎపిసోడ్​లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) గెస్టుగా రాబోతున్నారని సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్, ఏపీ డిప్యూటీ సీఎం కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు గత సీజన్​లోనూ ఈ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే సీజన్-4(Unstoppable Season 4) ప్రారంభం కాబోతోందట.

అన్​స్టాపబుల్​లో అల్లు అర్జున్

అయితే మొదట ఈ ఎపిసోడ్​లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​తో చేయాలనుకున్నారట. కానీ గతంలో గెస్టుగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కూడా ఈ షోకు గెస్టుగా వస్తే.. ఈ ముగ్గురితో రెండు ఎపిసోడ్లు షూట్ చేయొచ్చని ఆహా టీమ్ భావిస్తోందట. ఇక ఆ తర్వాత ఎపిసోడ్​లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడట. ఇక మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కూడా ఈ సీజన్​లో గెస్టుగా రానున్నట్లు సమాచారం.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *