Rythu Bharosa: యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా.. ఆ రిపోర్టు తర్వాతే విధివిధానాలు

Mana Enadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇప్పటికే రూ.2లక్షల రైతు రుణమాఫీ(Loan waiver) అమలు చేయగా.. రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. పంట సాగు కోసం గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.10 వేలు 2విడతల్లో ఇవ్వగా.. అదే పథకాన్ని రైతు భరోసా మార్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.15 వేలు (ఖరీఫ్, రబీ సీజన్‌లో) ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రకటించింది. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నా.. ఈ పథకం అమల్లోకి రాలేదు.

 మంత్రివర్గ సబ్​ కమిటీ రిపోర్ట్ తర్వాతే..

రాష్ట్ర మంత్రివర్గ సబ్​ కమిటీ రిపోర్ట్(Ministerial Sub-Committee Report)​ ఇచ్చాకే, వచ్చే యాసంగి సీజన్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని, ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) వెల్లడించారు. రూ.2 లక్షల వరకు రుణాలుండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి, డిసెంబర్​లోగా వారి అకౌంట్​లలో నిధులు జమ చేస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న వారి కోసం షెడ్యూల్ ప్రకటించి, అర్హత గల వారికి అమలు చేస్తామని తెలిపారు. వచ్చే సీజన్‌ నుంచి పంటల బీమా పథకం(Crop Insurance Scheme) అమలు చేస్తామన్నారు.

 అర్హులందరికీ పెట్టుబడి సాయం: మంత్రి తుమ్మల

“అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందించడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యం. దీనికి అనుగుణంగా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు(Rythu Bandhu) కింద కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, సాగులో లేని భూములకు సైతం దాదాపు రూ.25 వేల కోట్లు వెచ్చించారు. మా ప్రభుత్వ హయాంలో కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఫండ్స్ జమ చేస్తాం. విధివిధానాలు ఫైనల్ కాగానే, రాబోయే పంట సీజన్‌ నుంచి రైతుల ఖాతాల్లో పంట సాయం వేస్తాం. పంట వేసిన వారికే నిధులు అందిస్తాం. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్న మంత్రి తుమ్మల, ఇంకా 20 లక్షల మందికి అమలు కావాలి’’ అని తుమ్మల తెలిపారు. అలాగే అన్ని పంటలను మద్దతు ధరలతో కొంటామని ఆయన స్పష్టం చేశారు.

 

Share post:

లేటెస్ట్