Mana Endau: ‘‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’’… ఇది పోలీస్ స్టోరీ మూవీలో హీరో సాయికుమార్ చెప్పిన డైలాగ్ ఇది. అవును కొందరు పోలీసులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. సమాజ సేవలో.. శాంతిభద్రతల పరిరక్షణకు వారు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రపంచం నిద్రపోతున్నా తాము మాత్రమే మేల్కొని ప్రజలకు రక్షణ కల్పించేది పోలీసులు మాత్రమే. కుటుంబాన్ని, పండగలు, ఇతర వేడుకలకు దూరమై నిత్యం సమాజం కోసం పనిచేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోతుంటారు.
విధి నిర్వహణే వారి ప్రథమ కర్తవ్యం
ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ.. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు అమరులైన సంఘటనలు ఉన్నాయి. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటారు. దేశ సరిహద్దుల్లో సైనికులు(Soldiers on the Borders) దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు(Police in maintenance of law and order) తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది పోలీసులు నేరాలను అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు ‘‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day)’’. ఈ సందర్భంగా అమరుల త్యాగానికి ఓ సెల్యూట్(Salute) చెబుదాం..
అమరులను స్మరించుకున్న కేంద్రమంత్రులు, సీఎంలు
కాగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Police Commemoration Day) సందర్భంగా కేంద్ర హోం, సహాయ మంత్రులు అమిత్ షా, బండి సంజయ్(Amit Shah, Bandi Sanjay) నివాళి అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్(National Police Memorial in Delhi) వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరులను స్మరించుకున్నారు. వారి త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) సైతం పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు.
Our brave police personnel are our pride. Speaking on #PoliceCommemorationDay at the National Police Memorial in New Delhi.
https://t.co/CaZg3yIBJT— Amit Shah (@AmitShah) October 21, 2024