Mana Enadu : ఓ సినిమాలో ‘నాాగార్జున గారు నన్ను ఎలిమినేట్ చేసేయండి సర్’ అని ఓ డైలాగ్ ఉన్నట్లు.. ఎన్ని హింట్లు ఇచ్చినా.. ఎంత మోటివేట్ చేసినా.. బిగ్‌బాస్-8 హౌజు(Bigg Boss 8)లో కంటెస్టెంట్ నాగమణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసేయమంటూ పదే పదే కోరాడు. చివరకు ప్రేక్షకులు మెచ్చి ఓట్లు వేసినా.. మణికంఠ తాను కోరుకున్నట్లే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ వారం నామినేషన్స్‌లో మణికంఠ (Manikanta bigg boss), గౌతమ్‌లు చివరి వరకూ నిలవగా.. మణికంఠ తాను హౌజు నుంచి వెళ్లిపోతానని అన్నాడు.
ఎంత చెప్పినా వినలేదు..
ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోమని నాగార్జున ఛాన్స్ ఇచ్చినా.. మోటివేట్ చేసినా.. అతను మాత్రం నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో అతడి కోరిక మేరకు బిగ్‌బాస్ సీజన్-8 నుంచి మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రేక్షకులు వేసిన ఓట్ల వివరాలను రివీల్ చేస్తూ.. ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉందని చెప్పారు. కానీ మణికంఠ తనని తాను ఎలిమినేట్ (Manikanta Elimination) చేయమని కోరడంతో అతడిని ఇంటి నుంచి బయటకు పంపినట్లు తెలిపారు.
డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యమనుకున్నా
ఇక అనంతరం వేదికపైకి వచ్చిన మణికంఠతో ఎందుకు సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నావు అని నాగార్జున(Nagarjuna) అడిగారు. ‘‘ఎనర్జీ తగ్గిపోయింది. ఏదో నన్ను నేను నెట్టుకొస్తున్నా. ఫన్ టాస్క్ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నా కానీ.. ఫిజికల్ టాస్క్‌కి వస్తేనే చాలా స్ట్రెస్‌కు లోనవుతున్నాను. ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉన్నా. నాకు ఓటు (Naga Manikanta Vote) వేసిన వాళ్లందరికీ క్షమాపణ చెబుతున్నా. లక్ష్మీ దేవి కంటే ఆరోగ్యం ముఖ్యం. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్ వేదిక మంచి అవకాశం ఇచ్చింది. ప్రేక్షకుల సహకారం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చా. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు పునర్జన్మనిచ్చారు’’ అని మణికంఠ అన్నాడు.
బోట్ ఎక్కేదెవరు.. మునిగేదెవరు?
హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరిని బోట్ ఎక్కిస్తావు? ఎవరిని ముంచేస్తావు? అని నాగార్జున అడగ్గా.. నైని పావనీ స్ట్రాటజీలు బాగున్నాయని.. విష్ణుప్రియ()Vishnu Priya మనసు చాలా స్వచ్ఛమైనదని చెప్పుకొచ్చాడు. ఇక నబీల్ గురించి మాట్లాడుతూ.. తెలివైన అబ్బాయని కితాబిచ్చాడు. మెహబూబ్ చాలా సైలెంట్ అని.. విజేతకు ఉండాల్సిన లక్షణాల్లో ఇదీ ఒకటని అన్నాడు. అవినాష్(Avinash), రోహిణి, హరితేజ మంచి ఎంటర్‌టైనర్లని.. ఇలా చేస్తూ ఉంటే వీళ్ల పడవ ముందుకు వెళ్తుందని.. లేకపోతే మునిగిపోతుందని తెలిపాడు. ఇక టేస్టీ తేజలో ఎనర్జీ కనిపించలేదని.. ఇలాగే వెళ్తే, తనలాగే మునిగిపోవడం ఖాయమన్నాడు మణికంఠ. నిఖిల్‌లో మొదట్లో ఉన్న ఆట ఇప్పుడు లేదని.. పృథ్వీ మంచి గేమర్ అని.. కితాబిచ్చాడు. ఇక గౌతమ్‌కు అవసరమైనప్పుడే మాట్లాడమని సలహా ఇచ్చాడు.