ఈ స్టార్ హీరోయిన్ మొదట్లో నటిగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, తక్కువ కాలంలోనే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక్క తెలుగు సినిమా చేసినా, అది భారీ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటోంది. మరి ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Jhanvi kapoor).
బాలీవుడ్ ఎంట్రీ ‘ధడక్’తో
జాన్వీ తన సినీ కెరీర్‌ను 2018లో ‘ధడక్’ చిత్రంతో మొదలుపెట్టింది. ఇది మరాఠీ బ్లాక్‌బస్టర్ సైరత్ రీమేక్. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్నా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా, హిందీ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ఆమె నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ – ఒక్క సినిమాతో హిట్
జాన్వీ తెలుగులో చేసిన తొలి చిత్రం ‘దేవర’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో తంగం పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ , తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో, జాన్వీ కపూర్‌కు టాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
వరుసగా స్టార్ హీరోల ప్రాజెక్ట్స్
ప్రస్తుతం జాన్వీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఇది భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అంతేకాకుండా, దేవర 2లోనూ మళ్లీ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయనుంది.
హిందీలోనూ జాన్వీ దూసుకుపోతున్నది
తెలుగులో బిజీగా ఉన్నప్పటికీ, జాన్వీ బాలీవుడ్‌లోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. లేడీ ఓరియెంటెడ్ కథలపై ఆసక్తి చూపుతూ, నటిగా తన స్థాయిని మరింత పెంచుకుంటోంది.
సోషల్ మీడియాలో జాన్వీ క్రేజ్
ఇప్పటికే సోషల్ మీడియాలో జాన్వీ పోస్ట్ చేసే ఫోటోలు, లుక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్, నటన రెండింటినీ సమపాళ్లలో మెయింటైన్ చేస్తూ, హిట్స్-ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది.






