IPLలో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్‌లో మూడు జట్లు ప్లేఆఫ్స్(Playoffs) చేరాయి. దీంతో చివరి వరకూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఛాన్సు లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై గుజరాత్ టైటాన్స్(GT) ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు(GT)తోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలి ఒక్క స్థానం కోసం ముంబై(MI), ఢిల్లీ(DC), లక్నో(LSG) జట్లు పోటీలో ఉన్నాయి. ఇక ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్, కోల్‌కతా జట్లు ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
200 పరుగుల లక్ష్యం ఉఫ్..
ఢిల్లీ(Delhi) వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ముందుగా ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. ఆ తర్వాత 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19వ ఓవర్లలోనే ఛేదించింది. సాయి సుదర్శన్(108 నాటౌట్), గిల్(93 నాటౌట్) దంచికొట్టడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 205 రన్స్ చేసి విజయతీరాలకు చేరింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
What consistency from Sai Sudarshan…well deserved century 👏 👏👏#DCvsGT #GTvsDC pic.twitter.com/Y1WD6HKakV
— Aryan (@chinchat09) May 18, 2025
రాహుల్ సెంచరీ వృథా..
ఢిల్లీ ఇన్నింగ్స్‌లో KL రాహల్ చేసిన శతకం వృథా అయ్యింది. ఓపెనర్‌గా వచ్చిన అతను చివరి వరకూ అజేయంగా నిలిచాడు. ఢిల్లీ 199 పరుగులు చేసిందంటే కారణం రాహుల్ మాత్రమే. మరో ఓపెనర్ డు ప్లెసిస్(5) దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ పొరెల్(30), కెప్టెన్ అక్షర్(25) ఎంతో సేపు క్రీజులో లేరు. అయినప్పటికీ రాహుల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. గుజరాత్ బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలు పట్టించాడు. 65 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో T20ల్లో KL రాహుల్ 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 224 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్ సాధించిన అతను వేగంగా 8 వేల పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
60 balls century in first innings will hardly win you any game in T20 cricket.
– KL Rahul’s innings today was another justification of it.
– Many 60 balls centuries have ended up in a losing cause.#DCvsGT #KLRahul #GTvsDCpic.twitter.com/i8s88jmJm7
— Inside out (@INSIDDE_OUT) May 18, 2025






