అత్యాచారానికి స‌హ‌క‌రించ‌లేద‌ని కాల్చేశారు!

అత్యాచారానికి ప్ర‌తిఘ‌టించింద‌ని ఓ మహిళ‌ను తుపాకీతో కాల్చిన‌ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బంగావ్ ఠాణా ప‌రిధిలో నివ‌సిస్తున్న ఓ మ‌హిళ ఇంటికి అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆమె స‌మీప బంధువు, మ‌రో వ్య‌క్తి వ‌చ్చారు. బ‌ల‌వంతంగా ఆమెను స‌మీపంలోని చెరువు వ‌ద్ద‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు కేక‌లు వేయ‌డంతో ఆమెపై కాల్పులు జ‌రిపారు. దీంతో బాధితురాలి కాలికి బుల్లెట్ త‌గిలింది. వారి నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్న మ‌హిళ… కుటుంబ‌స‌భ్యుల‌కు విష‌యం చెప్పింది. దీంతో ఆమెను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

Share post:

Popular