పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)’ ట్రైలర్(Trailer) సినీ ప్రియులను, అభిమానులను ఉర్రూతలూగించింది. నిన్న (జులై 3) విడుదలైన ఈ ట్రైలర్ 24 గంటల వ్యవధిలో యూట్యూబ్(You tube)లో 48 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ ట్రైలర్ భారతీయ సినిమా చరిత్ర(Indian Movie History)లో అత్యంత వేగంగా వీక్షణలు సాధించిన ట్రైలర్‌లలో ఒకటిగా నిలిచింది. క్రిష్ జాగర్లమూడి(Krish Jagrlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, పవన్ కళ్యాణ్‌ను వీరమల్లు పాత్రలో యోధుడిగా చూపిస్తూ హై-ఆక్టేన్ యాక్షన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకుంది.
The verdict is LOUD and CLEAR#RecordBreakingHHVMTrailer #HariHaraVeeraMallu pic.twitter.com/UO4JF284Kf
— Atharvana Bhadrakali Pictures (@AtharvanaGlobal) July 4, 2025
9 లక్షలకు పైగా లైక్స్‌తో దూసుకెళ్తోంది..
ఈ మూవీలో బాబీ డియోల్(Bobby Deol) మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో కనిపిస్తుండగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) కీలక పాత్రలో నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీ.ఎస్. సినిమాటోగ్రఫీ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చాయి. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు(Action Scenes) అభిమానులను ఆకర్షించాయి. సోషల్ మీడియాలో #HHVMTrailer ట్రెండింగ్‌లో నిలిచి 9 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.






