
BRS నుంచి గెలుపొంది కాంగ్రెస్(Congress)లో చేరిన 10 మంది MLAలపై చర్యలు తీసుకోవాలంటూ BRS వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్(Speaker)ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 10వ తేదీన విచారణ సందర్భంగా కోర్టు ఈమేరకు ప్రశ్నించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే… తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు(FEB 18) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది MLAలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ BRS పార్టీ గత నెల 15న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్(Petition)ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను BRS దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: KTR
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు(By-elections in Telangana) ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.