పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab). ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ‘రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన కాసేపటికే మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్(Zarina Wahab) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘రాజా సాబ్’ సినిమాలో జరీనా వహాబ్, ప్రభాస్ తల్లిగా నటిస్తున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ: “ప్రభాస్ చాలా మంచి మనిషి. సెట్‌లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆయనలో అసలైన మానవత్వం ఉంది. వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి – ఒకరు నా కొడుకు సూరజ్, మరొకరు ప్రభాస్ కావాలి” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ *‘స్పిరిట్’*లో నటించనున్నాడు. ఇందులో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో కూడా ఓ పిరియాడికల్ ప్రాజెక్ట్ ప్రభాస్ లైనప్‌లో ఉంది.






