జార్ఖండ్‌ సీఎంగా నాలుగోసారి హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

Mana Enadu : జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత, హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) గురువారం (నవంబర్ 28) ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ (Jharkhand Governor) ఆయనతో ప్రమాణం చేయించారు. జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. 

ఇండియా కూటమి నేతలు హాజరు

హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆప్‌ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar), ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, ఇతర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.

నాలుగోసారి సీఎంగా ప్రమాణం

హేమంత్ సోరెన్ ఇప్పటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రి (Jharkhand New CM)గా పని చేశారు. తాజాగా నాలుగో సారి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు హేమంత్. ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సోరెన్ మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టి ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టుకున్నారు. 

జైలు నుంచి సీఎం ఆఫీసు వరకు

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం (JMM in Jharkhand) పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 81 స్థానాలుండగా, జేఎంఎం 34 చోట్ల.. బీజేపీ (BJP)కి 21 సీట్లు, కాంగ్రెస్‌ 16 సీట్లు, ఆర్జేడీ 4 సీట్లు దక్కించుకున్నాయి. సీపీఐ (ఎంఎల్‌) రెండు, ఏజేఎస్‌యూపీ, లోక్‌ జనశక్తిపార్టీ (రాం విలాస్‌), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో ఒక స్థానంలో విజయం సాధించాయి. ఈ క్రమంలోనే జేఎంఎం నేతృత్వంలోని కూటమి సర్కార్ తాజాగా రాష్ట్రంలో కొలువుదీరింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *