ప్రభుత్వానికి సహకరిద్దాం.. అల్లు అర్జున్ స్పెషల్ వీడియో వైరల్

Mana Enadu : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరా (Drugs Supply), వినియోగంపై కట్టడి మొదలు పెట్టింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మరోవైపు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పలువురు ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సినీ ప్రముఖులను డ్రగ్స్ నివారణ, కట్టడికై అవగాహన కల్పించేలా వీడియోలు రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోలు డ్రగ్స్ కట్టడి కోసం అవగాహన వీడియోలు రూపొందించారు. తాజాగా ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు.

డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడిలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అల్లు అర్జున్‌ (Allu Arjun) పిలుపునిచ్చాడు. మాదకద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధితులకు అండగా నిలవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశాడు. డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌ (Telangana Narcotic Team)కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఈ ప్రత్యేక వీడియో షేర్‌ చేశాడు.

‘‘మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్‌ (Drug Addicts) తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నంబర్‌: 1908కు ఫోన్‌ చేయండి. వారు బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకూ జాగ్రత్తగా చూసుకుంటారు.  ప్రభుత్వ ఉద్దేశం వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’’ అని వీడియోలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Share post:

లేటెస్ట్