Mana Enadu: ప్రస్తుతం తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్‌పై రగడ కొనసాగుతోంది. సోమవారం (OCT 21) నుంచి జరగనున్న మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, G.O. 29ని రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే HYDలోని అశోక్ నగర్‌లో కొన్నిరోజులుగా అభ్యర్థులు, విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడం, ప్రతిఘటించిన వారిని అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇంతకీ ఈ వివాదానికి అసలు కారణమేంటో తెలుకుందాం..
మూడు సార్లు ప్రిలిమ్స్ నిర్వహించారు
రాష్ట్రంలో Group-1 ఎగ్జామ్ ఇప్పటికే 2022, 2023, 2024లో 3 సార్లు నిర్వహించారు. TSPSCలో తొలిసారి పేపర్ లీక్ అవడంతో ప్రిలిమ్స్ పరీక్ష(Prelims Exam)ను రద్దు చేశారు. ఆ తర్వాత కమిషన్ సరైన నిబంధనలు పాటించలేదని హైకోర్టు(High Court) రెండోసారి రద్దు చేసింది. ఇక ఈ ఏడాది Juneలో ప్రభుత్వం మూడోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అయితే ఈసారి అదనంగా 63 పోస్టులు కొత్త నోటిఫికేషన్‌కు కలపడంతో మొత్తం 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష(Mains Exam)కు అర్హత సాధించినట్లు కమిషన్ ప్రకటించింది. కానీ మెయిన్స్‌కు 34వేల మందికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించిందని కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. క్రమంగా ఈ వివాదం G.O. 29 మీదకు మళ్లింది.
జీవో 29ని తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్
2022లో BRS ప్రభుత్వం జారీ చేసిన Group-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అదే సమయంలో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ.. GO 29ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్(Merit) ప్రకారం ఎంపిక చేస్తే 60% అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. దీంతో మెరిట్ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్ కోటాలో ఎంపికవుతారు. మెరిట్ తక్కువ ఉన్న అభ్యర్థులకు..రిజర్వుడు కేటగిరీలో అవకాశం లభిస్తోంది. దీనివల్ల అటు ఓపెన్ కోటాలోనూ..ఇటూ రిజర్వుడు కోటాలో కూడా రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది.
సుప్రీంకోర్టు ఏం చెబుతుందో..
అయితే GO 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదన. రిజర్వుడ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు వచ్చేవరకూ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
PRAJA PALANA
C/O TELANGANA SECRETARIAT!Within 10 months of #Congress coming to power, the much touted Praja Palana slogan is in shambles, with students demanding for justice.
Group1 Aspirants take their protest from Ashok Nagar to the gates of Telangana secretariat shouting… pic.twitter.com/A79wtu37h8
— Revathi (@revathitweets) October 19, 2024






