Mana Enadu: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Sri Venkateswara Swamy) భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(Arjitha Seva Ticket) నేడు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంటలకు TTD అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(Special Entry Darshan) రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి రానున్నాయి.
అందుబాటులోకి రానున్న టికెట్లివే
తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కోసం 2025 JANకి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. TTD ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ(అక్టోబర్ 19) ఆర్జిత సేవల(Arjitha Seva Ticket) కోటాను విడుదల కానుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీడిప్(Electronic LuckyDip) కోటా కింద OCT 21న అందుబాటులోకి తీసుకువస్తారు. TTD వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
నవంబరు 28 నుంచి డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Kalyanotsavam, Oonjal Seva, Arjitha Brahmotsavam), సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్(TTD Online)లో విడుదల చేయనుంది. అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు, అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు. కాగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams of Goddess Sri Padmavati) నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్నాయి.