CM Revanth On Group-1: గ్రూప్-1 అభ్యర్థులు అపోహలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు: సీఎం రేవంత్

Mana Enadu: గ్రూప్-1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దని, కావాలనే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపికలో రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన స్పందించారు. కొన్ని పార్టీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలనుకుంటున్నాయని వారు ఎలాంటి దుర్మార్గులో ఒకసారి నెమరువేసుకోవాలని CM రేవంత్ సూచించారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని, వాయిదాల వల్ల విద్యార్థులు ఇతర ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. న్యాయస్థానాలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయని సీఎం తెలిపారు.

 బంగారు అవకాశాన్ని కోల్పోవద్దు: CM

దయచేసి ఆందోళన విరమించి మెయిన్ పరీక్షకు హాజరుకావాలని లేదంటే బంగారు అవకాశాన్ని కోల్పోతారని సీఎం రేవంత్ Group-1 అభ్యర్థులకు సూచించారు. కొందరు ఉద్యోగాలు పోయినవారు ఆందోళన చేస్తున్నారంటూ BRS నేతలపై విమర్శలు చేశారు. GO 55ప్రకారం భర్తీ చేస్తే SC, ST, BC అభ్యర్థులు నష్టపోతారని అందుకే GO 29 తీసుకువచ్చినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే GO 29ని తీసుకొచ్చామని, ఇప్పుడు ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అభ్యర్థులపై లాఠీచార్జీ చేయవద్దని, కేసులు పెట్టవద్దని పోలీసులకు సూచిస్తున్నట్లు CM స్పష్టం చేశారు. కాగా, అక్టోబర్ 21 నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

 వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటి: శ్రీనివాస్ గౌడ్

ఇదిలా ఉండగా అశోక్ నగర్‌, ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలకు యువత నుంచే కాకుండా BJP, BRS లాంటి రాజకీయ పార్టీల నేతల నుంచి మద్దతు లభిస్తోంది. అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటం సరికాదని శనివారం బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలను CM రేవంత్‌ రెడ్డికి చెప్పేందుకే తాను అభ్యర్థులతో కలిసి సచివాలయానికి వెళ్తున్నానని చెప్పడంతో సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనాల్లో ఆయనను అక్కడి నుంచి తరలించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు BRS అండగా ఉంటుందని తెలిపారు.

 

Share post:

లేటెస్ట్